telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందుకే పిల్లలు వద్దనుకున్నారు… కొరటాల గురించి షాకింగ్ నిజాలు వెల్లడించిన చిరు

Chiranjeevi-with-koratala

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి జత కట్టబోతోంది. సోనూసూద్‌ మరో కీలక పాత్రలో నటించబోతుండగా.. రెజీనా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ కొరటాల గొప్పతనం గురించి వివరించారు. ‘‘ఆచార్య నిమిత్తం అతనితో ఇంటరాక్ట్‌ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత కొరటాల శివ లోతైన వ్యక్తిగా కనిపించాడు. సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్న వ్యక్తి. దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి అతనిలో ఆందోళన ఎక్కువ. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి వ్యధతో మాట్లాడతాడు. కొరటాల శివలోని సేవాతత్పరత నాకు బాగా నచ్చింది. శ్రీమతితో కలిసి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజసేవకు వెచ్చించే వ్యక్తి కొరటాల. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని… బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట. గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయి. కొరటాల శివ వామపక్ష భావాలున్న మనిషి. ఆ నేపథ్యం నుండి వచ్చాడు. అతని వ్యక్తిగత భావజాలం ‘ఆచార్య’లోని నా పాత్రలో కనపడుతుంది..’’ అని చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

Related posts