telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా మనసు దోచింది వాళ్ళే: తమన్నా

tamanna

తమన్నాకు భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురి హీరోలకే ఉందట. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నా తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇదే విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తమన్నా భాటియా ప్రస్తుతం 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దాదాపు పదిహేనేళ్లపాటు వెండితెరపై అగ్రకథానాయికగా కొనసాగింది. తమన్నా ప్రస్తుతం 30కి చేరువైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. దీనికి సంబంధించి ఆసక్తికరమైన సమాధానమిచ్చింది తమన్నా. ఒకవేళ మీ అమ్మ స్వయం వరం ఏర్పాటు చేస్తే ఎవరు రావాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు బదులుగా.. ఒకవేళ మా అమ్మ గనుక నాకు స్వయం వరం ఏర్పాటు చేస్తే.. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్‌లను కూడా పిలుస్తానని చెప్పింది. వీరి ముగ్గురికే నాకు భర్త అయ్యే అర్హత ఉందని చెప్పింది తమన్నా.

Related posts