telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఖిల్ కోసం హీరోయిన్ ను సెలెక్ట్ చేసిన చరణ్

akhil

అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో సినిమా ఉంటుంది. అయితే అఖిల్ కెరీర్ ను సెట్ చేసే బాధ్యతను రామ్ చరణ్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ కు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్ తన వద్దకు సూరి తీసుకు వచ్చిన కథను పంపించాడని, అలాగే నిర్మాత అనిల్ సుంకరను ఆ ప్రాజెక్ట్ కు నిర్మాతగా ఉండాలని కూడా సూచించాడట. ఇక హీరోయిన్ విషయం లోనూ సలహా ఇచ్చాడట చరణ్. అఖిల్ సరసన రష్మిక మందన పేరును సూచించాడట చరణ్. ప్రస్తుతం రష్మీక లక్కీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఈ ఏడాది సరిలేరు, భీష్మ సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకుంది. రష్మిక ‘ఆచార్య’లో చరణ్ కు జోడీగా కూడా నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అఖిల్ హీరోయిన్ పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts