telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్, క్రిష్ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్…!

Pspk27

రెండేళ్ళ విరామం తర్వాత “పింక్” మూవీ రీమేక్ “వకీల్ సాబ్”తో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇప్పటికే మొదలు పెట్టేశాడు పవన్.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే సైలెంట్‌గా రెండు కీల‌క షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని చుస్తునారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ హైలెట్ గా ఉండనున్నాయట. ఇందుకోసం హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకురానున్నారట. ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి చిత్రాలకు పని చేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీలుక్ కూడా రిలీజ్ అయ్యింది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు “విరూపాక్ష” అనే టైటిల్ ను అనుకుంటున్నారని తెలుస్తుంది.

Related posts