telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“భాగమతి” హిందీ రీమేక్ లో భూమి ఫడ్నేకర్

Bhumi

అనుష్క హీరోయిన్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అరుంధతి”. ఈ చిత్రం తెలుగులో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జేజమ్మగా అనుష్క చేసిన అద్భుతాభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఈ చిత్రంతో అనుష్క కెరీర్ మలుపు తిరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా… అనుష్క నటించిన మరో చిత్రం “భాగ‌మ‌తి”. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కి అశేష ప్ర‌జాద‌ర‌ణ పొందింది. విద్యుల్లేఖ‌ రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. టాయిలెట్‌: ఏక్ ప్రేమ‌క‌థ చిత్ర నిర్మాత‌లు రీమేక్ రైట్స్ ద‌క్కించుకోగా, ఇందులో భూమి ఫ‌డ్నేక‌ర్ లీడ్ రోల్ పోషించ‌నుందని చెబుతున్నారు. ఒరిజ‌న‌ల్ వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేసిన అశోక్‌.. రీమేక్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Related posts