telugu navyamedia
సినిమా వార్తలు

కలెక్షన్స్ తో కిక్ ఇస్తున్న “ఎఫ్-2″… అంతేగా… అంతేగా…!!

f2
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్-2” ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది.
పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. కాకినాడలో ఈ సినిమా తొలివారం సాధించిన షేర్ విషయంలో 4వ స్థానంలో నిలిచింది. ఇక మొదటివారం కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఇప్పుడు 50 కోట్లకు పైగా షేర్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి 60 కోట్ల షేర్స్ కూడా రావచ్చంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నిర్మాత దిల్ రాజు గత ఏడాది వరుస అపజయాలతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మొదట్లోనే F2 తో మంచి లాభాలను అందుకున్నాడు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా డిమాండ్ పెరిగింది. అంతేకాదు అనిల్ రావిపూడి తన కొత్త సినిమాలకు పారితోషికం కూడా పెంచినట్లు తెలుస్తుంది.

Related posts