telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ”లో నాని ద్విపాత్రాభినయం ?

Jersey-First-Look
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “జెర్సీ” సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా, మధ్య వయసున్న యువకుడిగా నాని కనిపించనున్నాడు. క్రికెటర్ పాత్రలో నటించడం కోసం నాని కొన్ని రోజుల పాటు క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో నాని పోషిస్తోన్న పాత్ర పేరు అర్జున్. ఇప్పటికే విడుదల క్రికెటర్ లుక్ లో నాని ఆకట్టుకుంటున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది తాజా సమాచారం. తండ్రీ కొడుకులుగా రెండో పాత్రల్లోనూ నాని ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది. తన తండ్రి గురించి కొడుకు నాని చెబుతూ కథలోకి ప్రేక్షకులను తీసుకెళతాడని అంటున్నారు. ఇదే నిజమైతే మొదటిసారిగా నాని తండ్రీ, కొడుకుల పాత్రల్లో తెరపై కనిపించనున్నాడు. 

Related posts