telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”కు “యూ”

Laxmis NTR movie compliant CEC

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ విధించి, “యూ” సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఈనెల 29న విడుదల కానుంది.

అయితే ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేయగా, “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యాడు నిర్మాత రాకేశ్ రెడ్డి. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై సినిమాను లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించామని, సినిమాలో పసుపు జెండాలు తప్ప పార్టీ గుర్తులెక్కడా చూపలేదని వివరణ ఇచ్చారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన ఈసీ సినిమా విడుదల చేసుకోవచ్చని తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related posts