telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కరోనా’పై కీరవాణి సాంగ్..

keeravani

ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 చిత్రంలోని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్‌ను పేరడి చేశారు కీరవాణి. ‘వి విల్‌ స్టే ఎట్‌ హోమ్‌.. వి స్టే సేఫ్‌’ అంటూ స్వయంగా ఆయనే స్వరపరిచి పాడిన ఈ కరోనా పాటకు మంచి స్పందన లభిస్తోంది.. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి.. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి.. ఇంట్లోనే ఉండండి ఇష్ట దైవంను ప్రార్ధిస్తూ ఉండండి.. అనుమానం వచ్చినప్పుడల్లా చేతులు కడుక్కుంటూ ఉండండి అంటూ అద్భుతమైన సాహిత్యం అందించారు కీరవాణి. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

Related posts