telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ మాజీ కావడంతో టాటూను చెరిపేసి స్టార్ హీరోయిన్

Deepika

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రస్తుతం తన సినిమా ‘ఛపాక్’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీపికా న‌టించిన ‘ఛపాక్’ జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో దీపికా యాసిడ్ బాధితురాలిగా న‌టించారు. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రజలకు బాగా చేరువైన టీవీ షోల ద్వారా తన చిత్రాన్ని ప్రచారం చేసుకునే పనిలో ఉన్నారామె. ఇందులో భాగంగా దీపికాను నిశితంగా గ‌మ‌నించిన కొంద‌రు మీడియా వర్గం వారు ఓ విష‌యాన్ని తెలుసుకున్నారు. ఈ అమ్మ‌డు ర‌ణ‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోవ‌డానికి ముందు బాలీవుడ్ స్టార్ హీరో, చాక్లెట్ బాయ్ ర‌ణ‌భీర్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది. అత‌ని పేరు సూచించేలా ఆర్‌కే అనే అక్ష‌రాల‌ను త‌న మెడ‌పై ప‌చ్చ‌బొట్టు వేయించుకుంది. ఇప్పుడు ఆ ఆక్ష‌రాల‌ను క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ అక్ష‌రాల‌ను పర్మినెంట్‌గా తీసేయించిందా? లేక మేక‌ప్‌తో క‌వ‌ర్ చేసుకుందా? అని తెలియ‌డం లేదు.

Related posts