telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

14న ‘మిస్టర్‌ మజ్ను’ జ్యూక్‌ బాక్స్‌ …

mr.majnu movie juke box on 14th
అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలకు, టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ‘ఏమైనదో… ఏమైనదో’, మిస్టర్‌ మజ్ను టైటిల్‌ సాంగ్‌, ‘హార్ట్‌ బ్రేక్‌’ పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. జనవరి 14 ఉదయం 10 గంటలకు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జ్యూక్‌ బాక్స్‌ను విడుదల చేయబోతున్నారు. 
అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి. 

Related posts