telugu navyamedia
క్రీడలు వార్తలు

షారుఖ్ ఖాన్‌‌‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనిల్‌ కుంబ్లే

గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో షారుఖ్ ఖాన్ అనే ఆటగాడిని‌‌‌ పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలు ఉంటే.. ఏకంగా రూ. 5 కోట్ల 25 లక్షలకు ఇతర ప్రాంచైజీలతో పోటీపడి మరీ కొనుగోలు చేసింది. ప్రధానంగా ఒక హిట్టర్‌ కావాలనే ఉద్దేశంతో షారుఖ్‌పై ముందు నుంచి ఫోకస్‌ చేసింది పంజాబ్. అయితే కుడి చేతి వాటం స్పిన్నర్‌ అయిన షారుఖ్ ఖాన్‌‌.. హార్ద్‌ హిట్టర్‌ కూడా. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకోవడంతో షారుఖ్‌ వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే పంజాబ్‌ కింగ్స్ అతనిపై కన్నేసి.. భారీ ధరకు కొనుగోలుచేసింది. ప్రస్తుతం షారుఖ్‌.. పంజాబ్‌ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోచ్‌ అనిల్‌ కుంబ్లే అతడికి బౌలింగ్ వేసి మరీ పరీక్షించారు. ప్రాక్టీస్‌లో షారుఖ్‌ ఆకట్టుకోవడంతో.. అతడిని ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కీరోన్‌ పొలార్డ్‌తో పోల్చారు. తాజాగా అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. గతంలో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా పని చేసిన సమయంలో కీరోన్‌ పొలార్డ్‌కు నెట్స్‌ బౌలింగ్‌ వేసిన విషయాన్ని ప్రస్తావించాడు. ‘నేను ముంబైతో కలిసి పని చేసిన సమయంలో పొలార్డ్‌ చాలా ప్రమాదకరంగా కనిపించేవాడు. ఇప్పుడు షారుఖ్ నాకు అలానే కనిపిస్తున్నాడు అని తెలిపాడు. అయితే ‌షారుఖ్ ‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్. చూడాలి మరి ఇందులో అతను ఎలా రాణిస్తాడు అనేది.

Related posts