ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కాపు ఉధ్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తీసుకురావద్దంటూ జగన్ కోరారు.
గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని తన లేఖలో సీఎంను కోరారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు… ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూలు చేసే అధికారం ఎక్కడిది ముద్రగడ ప్రశ్నించారు .
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని, వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. వారు సంతోషంగా ..ఆనందంగా ఉండేలా చేయండి అంటూ ముద్రగడ కోరారు..
కాగా.. శుక్రవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక సవరణలకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
ఆ వార్తలన్నీ వదంతులే: కిరణ్ బేడీ