telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేంద్రం నుంచి పేదలకు వచ్చే ఇల్లను అడ్డుకోకు కేసీఆర్..

మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ సీఎం కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. సిద్దిపేట ప్రజలను పొగడ్తలతో అభివృద్ధి కి దూరం చేస్తున్నారు. మనోహరాబాద్.. కొత్తపల్లి రైల్వే లైన్ 140కిలోమీటర్ల పనులు ఆగిపోయింది. అది గజ్వేల్ వరకు మాత్రమే అయ్యింది. జాయింట్ వెంచర్ లో రాష్ట్ర వాటా ఎప్పటిలోపు ఇస్తారో స్పష్టం చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఎలా సహకరిస్తారో తెలియజేయండి అని అడిగిన ఆయన ఆర్మూర్.. ఆదిలాబాద్ 337కిలోమీటర్ల రైల్వే మార్గం లో 2700కోట్ల ప్రాజెక్టును కేంద్రం ఆమోదించిన తరువాత అటువైపు చూడటం లేదు అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఈ లైన్ ఎంతో ఉపయోగకరం. భూ సేకరణతో పాటు రాష్ట్ర వాటా కోసం ఎదురు చూస్తోంది. మెదక్ ఉమ్మడి జిల్లా లో అక్కనపేట్ నుంచి మెదక్ 15కిలోమీటర్ల దూరం లైను నిర్మాణంకు కేసీఆర్ స్పందించడం లేదు.. ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మూడేళ్ళ క్రితం 200కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో ఇవ్వాల్సిన భూమి ఎండో మెంట్ వివాదం కారణంగా ఆగిపోయింది. అభివృద్ధి కి ఆస్కారం ఉన్న ప్రాజెక్టు ఇది.. దీనికోసం ఎప్పుడు భూమి కేటాయిస్తారో లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. సికింద్రాబాద్.. కాచీగూడ.. నాంపల్లి పై భారం తగ్గించేందుకు చర్లపల్లి వద్ద టెర్మినల్ కోసం 150 ఎకరాలు ఇవ్వమని కేంద్రం కోరింది. మీ తాత్సారం వల్ల రైల్వే వద్ద ఉన్న 50ఎకరాల్లో నే ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది.

ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కు రాష్ట్ర వాటా ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలి అన్నారు. యాదాద్రి కి ఎంఎంటీఎస్ కోసం సాంక్షన్ అయినా భూసేకరణ ఎందుకు చేయడం లేదు గత గ్రేటర్ ఎన్నికల్లో నగరం  డబల్ బెడ్రూం ఇల్లకోసం 6లక్షల అప్లికేషన్ లు ఇచ్చారు. తెలంగాణ లో హౌసింగ్ స్కీం కోసం కేంద్రం మొదటి విడత నిదులు ఇచ్చింది.. రెండో విడత కోసం లబ్ధిదారుల వివరాలు ఇవ్వమని అడిగింది. ధరకాస్తులు వెళ్తే ప్రతి ఇంటికి 1.5లక్షల సబ్సిడీ… 16పైసల వడ్డీ కి 6లక్షల రుణం వస్తుంది. పక్కరాష్ట్రం 20లక్షల ఇల్లు తెచ్చుకుంది… దేశంలో అన్ని రాష్ట్రాలు ఇల్లు తెచ్చుకున్నాయి. 2022 వరకు దేశంలో అందరికీ ఇల్లు ఇచ్చే లక్ష్యం తో పనిచేస్తున్నాడు మోడీ అని తెలిపారు. కేంద్రం నుంచి పేదలకు వచ్చే ఇల్లను అడ్డుకోకు కేసీఆర్.. ఢిల్లీ వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రజల కు లబ్ది చేకూర్చేలా కేంద్రాన్ని ఒప్పించాలి. పేదవారి ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ కోసం సంతకం పెట్టండి ముఖ్యమంత్రి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొటిమంది పేదవారికి ఏటా 5లక్షల రూపాయల భీమా వస్తుంది. పేదవారికి కార్పోరేట్ వైద్యం అందుతుంది అన్నారు.

Related posts