telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రదాడి… అమరులైన పోలీస్ అధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు

Jammu

జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లాలోని సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌ పోలీస్ అధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. పలు రౌండ్ల పాటు ముష్కరులు కాల్పులు జరిపి, పరారయ్యారని తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది.

Related posts