గత ఏడాది నుండి కరోనా మన దేశాన్ని వణికిస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులు తగ్గుతాయి అనుకున్నారు. అలాగే మొదట్లో కేసులు తగ్గిన ఇప్పుడు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు అయితే ఏకంగా 60 వేలకు పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే మన దేశంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయనాకులు ఈ కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే కరోనా బారిన పడ్డ.. సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు సచిన్ ప్రకటించారు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్వీట్ చేశాడు. మార్చి 27న సచిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు.
previous post
next post
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్