telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

విజయ్ పొలిటికల్ ఎంట్రీ… సొంత పార్టీతోనే…?

Vijay

కొన్నిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించిన చర్చలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మరోవైపు ప్రస్తుత రాజకీయాలను టార్గెట్‌ చేసుకొని తన సినిమాల్లో విజయ్ వేస్తున్న పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక, ఆయన పొలిటికల్ ఎంట్రీ వార్తలకు బలాన్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయబోతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఏ ఇతర పార్టీ తరపున కాకుండా సొంతంగా పార్టీ నెలకొల్పి పోటీ చేయాలనీ, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని కోలీవుడ్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగి అన్నీ చూసుకుంటున్నారని అంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి విజయ్ వర్గాలు సిద్దమయ్యాయనేది సమాచారం. కాగా ఇటీవల విజయ్ ఇంటిపై జరిగిన ఐటీ రైడ్స్‌, ఆ తర్వాత ఇంట్లో బాంబు ఉందంటూ కొంతమంది ఆకతాయిలు కలకలం సృష్టించడం లాంటి పరిణామాలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ మరింత హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి దీనిపై హీరో విజయ్ ఎలా స్పందిస్తారో.

Related posts