జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ మహిళ కారుతో సహా వాగులో కొట్టుకుపోయింది. కర్నూలు నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుగొట్ల సమీపంలో రోడ్డుపై నుంచి వాగు పొంగి ప్రవహిస్తోంది.
వరదతాకిడి ఎక్కువగా ఉండడంతో కుటుంబ సభ్యులు కారు దిగారు. ఆవలి ఒడ్డుకు కారును చేర్చే ప్రయత్నంలో మహిళ కారుతో సహా వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. బొంకూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అలంపూర్-రాయచూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.