telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్‌లో వాహనాలపై నిరంతర నిఘా!

traffic porns and corns by and to public

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైద్రాబాద్ నగరంలో వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘాను పెంచారు. వాహనదారులు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం దాటితే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందుతుంది. వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్‌ను ఫోటోలు తీసి సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్‌కు పంపుతారు. ఆర్టీఏ అధికారులు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వాహనాలపై నిఘా పెట్టారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ తరహాలో ప్రతి చౌరస్తాలో డేటా తయారు చేస్తున్నారు. సీసీ కెమెరాలో ఉన్న ఫీడ్ ఆధారంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వాహన నంబరు, ఫోన్ నంబరు, ఇతర వివరాలన్నీ రికార్డ్ చేస్తున్నారు.

Related posts