ఈ ఎన్నికలు కేవలం అభివృద్ధి మాత్రమే గీటు రాయి కానీ, కులం, మతం కాదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోహిణీ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీల గురించి, విద్య, వైద్యం గురించి మాట్లాడటం చాలా సంతోషమని పేర్కొన్నారు. అంటే ప్రచార సరళిని ఆమ్‌ఆద్మీ మార్చేసిందని, కేవలం అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మిగితా ప్రాంతాల్లో వారు కేవలం మతం, కులం ఆధారంగా ఓట్లు అడిగేవారు. అదే ఢిల్లీకి వచ్చే సరికి అభివృద్ధి ప్రధాన అజెండా అయి కూర్చుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.