telugu navyamedia
Uncategorized

నీట్, జేఈఈ పరీక్షలకు లైన్ క్లియర్..పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

Supreme Court

నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదావేయాలని దాఖలైన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. జేఈఈ, నీట్ లను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఆగస్టు 17న సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ వేశాయి.

పరీక్షల పిటిషన్ పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. ఇప్పటికే కేంద్రం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని, విద్యార్థులు కూడా సన్నద్ధులై ఉంటారని, ఇలాంటి తరుణంలో పరీక్షలు వాయిదా వేయడం సరికాదని కోర్ట్ అభిప్రాయపడింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  ధర్మాసనం పేర్కొంది.

Related posts