telugu navyamedia
Uncategorized

ఎప్పుడ‌ప్పుడా అని ఎదురు చూస్తున్న‌ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ నుంచి స్పెషల్‌ వీడియో విడుదలైంది. మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించారు.

ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, కీర్తిసురేశ్‌తో లవ్‌ ట్రాక్‌ ఇలా ప్రతిదీ అదరహో అనేలా ఉంది. ‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ రౌడీలతో మహేశ్‌ చెప్పే డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేశ్‌ అందం గురించి కీర్తి చెప్పే డైలాగ్‌, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌.. వావ్‌ అనిపిస్తున్నాయి.

చాలాకాలం నుంచి మహేష్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు “సర్కారు వారి పాట బ్లాస్టర్”తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం, పదిహేడు సెకన్ల ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మహేష్ బాబుని అభిమానులు ఊహించినట్లుగానే సూపర్ గా చూపించింది. మహేష్ స్టైలింగ్ కూడా సూపర్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మహేష్ టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ అదిరిపోయింది. సూపర్‌స్టార్‌ బర్త్‌డే రోజున విడుదలైన ఈ వీడియోతో అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ లభించినట్లే అయ్యింది.

“సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. ఈ టీజర్లో చాలా కాలం తరువాత అభిమానులను ఆకట్టుకునే మాస్, స్టైల్ ఉంది. డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కీర్తి సురేష్ అందంగా కన్పించింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మాది కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉంది.ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు “బ్లాస్టర్” ట్రీట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Related posts