telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

శ్రీలంక తరువాత .. భారత్ .. నిఘా హెచ్చరిక

intelligence-warning-to-india-on-terrorist-attacks

ఇటీవల శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు.. భారత్‌పైనా కన్నేశారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించారని పేర్కొంటూ కేంద్ర నిఘా సంస్థ (ఐబీ).. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోని రామంతాపూర్‌లో 19 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని, ఒకేచోట కాకుండా వేర్వేరుగా 19 ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్‌ చేశారని తెలిసింది.

ఓ వ్యక్తి, బెంగళూరు, మైసూరు నగరాల్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నారంటూ కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారంటూ ఆ రాష్ట్ర డీజీపీ దక్షిణాది రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరిలో హై అలెర్ట్‌ కొనసాగుతోంది. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Related posts