telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వాళ్ళందరూ నాకే .. ఓటు వేశారు..! : చంద్రబాబు

chandrababu meeting on voting and success

మహిళలంతా కులానికి అతీతంగా టీడీపీకే ఓటేశారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు నేతలు, ఏజెంట్లతో బాబు సమీక్ష నిర్వహించారు. పించన్లు, పసుపు-కుంకుమలో అదే కనబడిందని..పెద్దకొడుకు అనేభావం వృద్దుల్లో, అన్నగా అభిమానం చెల్లెళ్లలో పెరిగిందని బాబు తెలిపారు. ఎన్నికల్లో చూపిన స్ఫూర్తిని కౌంటింగ్ పూర్తయ్యేదాకా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. కౌంటింగ్‌లో ఏజెంట్లకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇవ్వాలన్నారు. చివరి ఓటు లెక్కించేదాకా ఏజెంట్లు అంతా కౌంటింగ్ హాలులోనే ఉండాలన్నారు.

ఇకపై టీడీపీలో పదవులకు, బూత్‌లలో ఆధిక్యతే ప్రామాణికం. ఏ స్థాయి నాయకుడికైనా అతని సొంత బూత్‌లో పార్టీ ఆధిక్యతే గీటురాయి. తన సొంత బూత్‌లో ఆధిక్యత లేకపోతే అతనికది మైనస్సే. మీ పరిధిలో టీడీపీ బలం, బలహీనత విశ్లేషించాలి. ఎన్నికల్లో సహకరించిన అంశాలు ఏమిటి? ప్రాసెస్ సక్రమంగా ఫాలో అయ్యారా? ప్రతికూలాంశాలు ఏమిటి అనేది విశ్లేషించాలి. బూత్‌లో ఓట్లు సరిగ్గా రాకపోతే మీ రూట్ సరిగ్గా లేనట్లే. పార్టీ శ్రేణుల మధ్య అంతరాల భర్తీ బాధ్యత బూత్ కన్వీనర్లు, సేవామిత్రలదే. ఒక బూత్‌లో 70% పోలింగ్, మరో బూత్‌లో 90% పోలింగ్ జరిగింది. ఒక బూత్‌లో ఆధిక్యత పెరిగింది, ఇంకో బూత్‌లో తక్కువ వస్తోంది. అందుకు కారణాలేమిటి అనేది అధ్యయనం చేయాలి. కులం ఎలా పనిచేసింది? డబ్బు ప్రభావం ఎలా పనిచేసింది? వాటిని అభివృద్ది, సంక్షేమం ఎలా అధిగమించింది? ఇలా అన్నింటినీ అధ్యయనం చేయాలి” అని నేతలకు చంద్రబాబు ఆదేశించారు.

ఎస్సీల ఓటింగ్ టిడిపికి పెరగడానికి సంక్షేమ పథకాలే కారణం. ఒరిజినల్ ఓట్ బ్యాంక్ పోగొట్టుకోరాదు. ముస్లింల ఓటింగ్ ఈ ఎన్నికల్లో టీడీపీకి బాగా పెరిగింది. ప్రధాని మోదీని సవాల్ చేసిన పార్టీగా దీనిని మరింతగా పెంచుకోవాలి. కులం,మతం మరిచిపోయాలా పార్టీతో ప్రజల అటాచ్ మెంట్ పెరగాలి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. సమాజంలో ఎప్పటికప్పుడు సంపద సృష్టించాలి. పెరిగిన సంపద పేదలకు పంపిణీ చేయాలి. పనులు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజలను ప్రభావితం చేసి పార్టీవైపు ఆకట్టుకోవడం అంతే ముఖ్యం. కార్యకర్తల సాధికారతతోనే పార్టీ సాధికారత. ఒక కొత్త అధ్యాయానికి పార్టీలో శ్రీకారం చుట్టాం. కార్యకర్తలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకితెచ్చే బాధ్యత నాదే. ప్రజలనుంచి ప్రతిఫలం ఆశించని సేవే రాజకీయం” అని బాబు చెప్పుకొచ్చారు.

Related posts