telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

15 నెలల పాప ఒంటినిండా పంటిగాట్లు… డే కేర్ సెంటర్ నిర్వాకం

Day-Care-Center

అమెరికాలోని అరిజోనాలో డే కేర్ సెంటర్లో నర్సరీ చదువుతున్న 15 నెలల చిన్నారిని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించడానికై చిన్నారి దుస్తులు తీయగా.. ఒంటిపై ఎర్ర రంగు మార్క్‌లు చూసి తల్లి 15 నెలల తన కూతురి ఒంటిపై ఇన్ని గాయాలవడం చూసి తల్లి గుండె కరుక్కుపోయింది. వెంటనే కోపంతో డే కేర్ సెంటర్‌కు వెళ్లి టీచర్లను నిలదీసింది. తమకు ఏం తెలీదంటూ వారు సమాధానమివ్వడంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరిలో ఈ ఘటన జరగగా గాయాలు ఎలా అయ్యాయి అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పసిపాపపై అంతలా గాయం చేసే మనసు ఎవరికొచ్చిందంటూ పాప తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ గాయాలు చేసే సమయంలో తన కూతురు ఎంతలా విలవిలలాడిందో అంటూ తల్లి కన్నీరు పెట్టుకుంది. గాయాలను ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. దాదాపు ఆ పోస్ట్‌కు 10 వేల కామెంట్లు వచ్చాయి. గాయాలు ఎవరు చేశారో తెలిసేంత వరకు వెనుదిరగద్దు అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి ఘటనే తమ పిల్లలకు కూడా జరిగిందంటూ మరికొందరు కామెంట్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారుల పట్ల డే కేర్ సెంటర్లు జాగ్రత్త వహించడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts