telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

యుఏఈ లో .. నెలలతరబడి జీతాలు రాక అల్లాడిపోతున్న.. భారతీయులు..

indians facing trouble in uae without salaries

భారతీయులు ఉపాధి కోసం యుఏఈకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సొంత ఊళ్లలో ఉపాధి లేక దేశ వ్యాప్తంగా సుమారు 300 మంది యుఏఈ లో కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కంపెనీ యాజమాన్యం మారడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. జీతాలు లేక, అక్కడ గదుల్లో ఉండలేక నరకయాతన అనుభవించారు.

ఎలాగోలా స్వస్థలాలకు చేరుకోవాలన్నా అక్కడ కంపెనీ సహకారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము ఐదు నెలలుగా పని చేస్తున్నా జీతాలు ఇవ్వడం లేదని వారు మీడియాకు ఫోన్లో తెలిపారు. స్వదేశానికి వెళ్లడానికి పాసుపోర్టు కావాలని కోరితే కంపెనీకి రూ.70వేలు చెల్లించి వెళ్లాలని చెబుతున్నారని బాధితులు తెలిపారు. వారి ఇబ్బందులుపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన భారత ప్రభుత్వం అక్కడి ఎంబసీపై ఒత్తిడి తెచ్చింది. దీనితో సౌదిలో ఉన్న ఎంబసీ అధికారులు కార్మికుల సమస్యలను సౌది ప్రభుత్వానికి నివేదించారు.

Related posts