జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఈ పోరు ముఖ్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీకి వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరారు. హిందీ, ఆంగ్ల భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరించారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక స్టాంప్‌నకు త్వరగా అనుమతివ్వాలని కోరారు. దక్షిణాది విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాలా స్టాంప్‌ను విడుదల చేయాలని విజ్ఙప్తి చేశారు సీఎం కేసీఆర్.
previous post
టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధి: నటి దివ్యవాణి