మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా. అయితే.. ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఆచార్య మూవీలో కోలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో చిరుతో కయ్యానికి సై అంటున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు… తమిళ స్టార్ అరవింద్ స్వామి. తెలుగులో రామ్ చరణ్ మూవీ ధృవలో అరవింద్ స్వామి విలన్‌గా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి తాజా సినిమాలో కూడా అరవింద్ స్వామి విలన్‌గా నటించబోతున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
previous post
next post
స్టార్ హీరోలపై ఉత్తేజ్ వ్యాఖ్యలు