వేప లో ఔషద గుణాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వర్షాకాలం వచ్చేసింది, ఈ కాలంలో అనేక వ్యాధులు ప్రభలుతుంటాయి. అటువంటి వాటి నుండి జాగర్తగా ఉండాలంటే ఖచ్చితంగా వేపను వాడాల్సిందే. ఈ వేపను ఆరోగ్య ప్రదాయినిగా అందరూ పూజిస్తారు, మందులలో వాడుతారు. వర్షాకాలంలో వేప చేసే మేలు మరే చెట్టు చేయదు అంటారు ఆయుర్వేద నిపుణులు. వర్షాల వలన వచ్చే ఇన్ఫెక్షన్ లని కంట్రో చేయాలంటే వేప సరైన ఔషధం. వర్షంలో తడిచిన తలపై చిన్న చిన్న కురుపులు వస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖంపై కూడా మొటిమలు వస్తాయి. ఈ మొటిమలు నివారించి, ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ఉండాలంటే వేప ఎంతో మేలు చేస్తుంది.
* వీటి ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలని, మొటిమలని నివారించడంలో కూడా కీలకంగా పనిచేస్తాయి.
* చాలా మంది ఉదయాన్నే లేచి వేప చిగుర్లు తింటూ ఉంటారు. అలాంటి వారికి కడుపులో నులుపురుగు సమస్య కూడా పోతుంది.
* వర్షాకాలంలో తల జిడ్డుగా మారడం, తలలో పీహెచ్ సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది. దాంతో తలపై చుండ్రు పేరుకుపోయి దురదలు పొక్కులు వాస్తాయి. దాంతో చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తలపై వేప ఆకులని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి బాగా ఆరనిచ్చి తలంటు పోసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా మారడమే కాకుండా, చుండ్రు కూడా పోతుంది.
రికార్డు సృష్టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ టీజర్