telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ ఫాన్స్ కు అదిరిపోయే శుభవార్త…

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై దర్శకుడు టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ ను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో కొమురం భీం, సీతారామరాజు సంబరాల్లో పాల్గొంటున్నట్టుగా అన్పిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులకు సినిమాను సినిమాను త్వరగా చూడాలన్న ఆతృతను పెంచేశాయి. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Related posts