ఒక్కొక్కరికి ఒక్కోదానిపై తారాస్థాయిలో అభిమానం, ప్రేమ ఉంటుంది. ఆయా అంశాల కోసం వారు ఎంతవరకైనా వెళ్తుంటారు. స్థాయిలలో తారతమ్యాలు కూడా మరిచిపోతుండటం చాలా అరుదు. ఆస్ట్రేలియా ప్రధాని విషయంలో అదే జరిగింది. ఆయనకు క్రికెట్ పై ఎంత మక్కువో తాజాగా నిరూపించారు. క్రికెట్‌పై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. మైదానంలో ఆసీస్ ఆటగాళ్లకు శీతల పానీయాలను అందించి ఆ దేశ ప్రధాని మోరిసన్ శెభాష్ అనిపించుకున్నారు.
మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు ఆసీస్‌కు విచ్చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ప్రైమ్ మినిష్టర్ ఎలెవెన్‌తో శ్రీలంక జట్టు తలపడింది. మ్యాచ్‌లో దసున్ శనక వికెట్ కోల్పోగానే ఆ దేశ ప్రధాని మోరిసన్ శీతల పానీయాల పెట్టెతో మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు పానీయాలు అందించారు. అంతేగాక వారితో కరచాలనాలు కూడా చేశారు. ఈ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్ జట్టు వికెట్ తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది.
జగన్ వి ఒంటెద్దు పోకడలు: పురందేశ్వరి