telugu navyamedia
సినిమా వార్తలు

“నేనొస్తున్నా” అంటున్న వరుణ్… “నేను చూస్తున్నా” అంటున్న నితిన్

Valmiki

హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయనున్నారు. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించనున్నారట. దీంతో చిత్ర యూనిట్ క్రమంగా ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం మరో పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వరుణ్ నోట్లో సిగార్ పెట్టుకుని, గన్‌ను భుజాన వేసుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫోటో ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘నేను వస్తున్నా! సెప్టెంబర్ 20న’ అని ట్వీట్‌ చేశాడు వరుణ్. దీనిపై స్పందించిన హీరో నితిన్.. వరుణ్ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ.. ‘నేను చూస్తున్నా సెప్టెంబర్ 20న’ అని పేర్కొన్నారు. ఇది చూసిన వరుణ్ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.

Related posts