డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు వారి జీవితంలో మైలురాయి వంటి విజయాలు అందించారు. గత కొంతకాలంగా పూరి జగన్నాధ్ సరైన సక్సెస్ లేక సతమతమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పూరి “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో వరుస ఫ్లాప్స్ కి అడ్డుకట్ట వేశాడు. ఇటీవల రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 30 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీనితో పూరి మరింత ఉత్సాహంతో తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండని పూరి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం పూరి, లావణ్య దంపతుల 23వ మ్యారేజ్ యానివర్సరీ. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్ సోషల్ మీడియాలో తన భార్య లావణ్యని పూరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్న పిక్ తో పాటు తన భార్యని ఉద్దేశించి రొమాంటిక్ పోస్ట్ పెట్టాడు. తన భార్యని ముద్దుగా పండు అని పిలుస్తూ… “పండూ… ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటా” అని కామెంట్ పెట్టాడు. సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
23 RD anniversary.. Pandu I Lov youuuu.. always @ilavanyapuri @pavithra_puri @actorakashpuri
ఇన్స్టెంట్ స్టోరీలు, డైలాగ్స్ వద్దు…టాలీవుడ్ డైరెక్టర్స్‌కి చిరు మందలింపు