telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’ డిలీటెడ్ సీన్ ఇదే.. – వైరల్

అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప . డిసెంబర్17న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగ, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బ‌న్నీ తొలిసారి మాస్ అవ‌తారంలో కనిపించాడు.

ప్ర‌స్తుతం థియేటర్స్ లో పుష్ప‌ బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లిపోతుంది. టాలీవుడ్‌లో రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.  

పుష్ప సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా పంచుకున్నారు మేకర్స్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

ఇందులో.. అల్లు అర్జున్ ఒక వడ్డీవ్యాపారి దగ్గర అప్పుచేయడం.. ఆ అప్పు తీర్చకపోవడంతో అతడు ఇంటి మీదికొచ్చి గొడవచేయడం చూపించారు. అప్పు ఇచ్చిన వ్యక్తికి బర్రెలు అమ్మి అప్పు తీర్చేస్తాడు పుష్పరాజ్‌. ఈ క్రమంలో అప్పు చెల్లించినట్లు ఊరందరికి చెప్పాలంటూ అతడిపై చేయిచేసుకుంటాడు.

అయితే లెంగ్త్‌ ఎక్కువైన కారణంగా ఈ సీన్‌ను చిత్రం నుంచి తొలగించారు. తాజాగా పుష్ప డిలీటెడ్‌ సీన్‌లో ఈ వీడియోను రిలీజ్‌ చేయగా కాసేపటికే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సీన్‌ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చిత్తూరు యాసలో బన్నీ డైలాగ్ కు ఫిదా అయిపోతున్నరు ఫ్యాన్స్.

ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ లు కీలక పాత్రల్లో నటించారు.

Related posts