ప్రస్తుతం ప్రయోఅంచంలో ప్రజల యొక్క బలహీనతల ఆధారం చేసుకుని, ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. సరిగ్గా ఇలాంటి కథాంశంతోనే ‘హనీ ట్రాప్’ మూవీ తెరకెక్కుతోంది. రంగస్థల నటుడు, రచయిత వి.వి. వామనరావు స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని హుస్సేన్ హౌస్ లో హీరోయిన్ ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చిత్రీకరించారు. ఋషి, శిల్ప, తేజు, శివకార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సీనియర్ నటులు ప్రసన్నకుమార్, సన హీరోయిన్ తల్లిదండ్రులుగా కనిపించబోతున్నారు. శశి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అతి త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి వచ్చే యేడాది సినిమాను జనం ముందుకు తీసుకెళతామని దర్శక నిర్మాతలు సునీల్ కుమార్ రెడ్డి, వామనరావు చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా… లేదా అనేది.
previous post