telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలో స‌రి కొత్త రికార్డు ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మ‌రో రికార్డు సృష్టించాడు.. అల్లు అర్జున్‌.. ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల విడుద‌లైన‌ ‘పుష్ప’ సినిమాతో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాది ఆడియెన్స్​ను విపరీతంగా అలరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బన్నీ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

అంతేకాకుండా పుష్ప దెబ్బకు హిందీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. బాలీవుడ్‌లో పుష్ప దగ్గరదగ్గరగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Allu Arjun clocks 15 million followers on Instagram | Deccan Herald

తాజాగా..ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బన్నీని ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఆదరిస్తున్నారు. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ ను స్టైలిష్ స్టార్ తన ఫ్యాన్ ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.

సినిమా విషయాలతో పాటు తన పిల్లలు, తదితర వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంటాడు. అందుకే అతనికి రోజు రోజుకి ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు బ‌న్నీ.ఈ సందర్భంగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలానే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

Allu Arjun Clocks 15 Million Followers On Instagram

Related posts