telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫోన్ పోగొట్టుకున్న యువతి… వెతికి తెచ్చిన తిమింగలం

Whale

బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తన ప్రొఫిషినల్ వర్క్‌తో పాటు రాజకీయాలు, పర్యావరణానికి సంబంధించిన పోస్టులను ఆమె తరచూ షేర్ చేస్తుంటారు. ఇటీవల ఆమె ఒక వీడియోను రీ ట్వీట్ చేశారు. ఒక తిమింగలం అత్యంత విచిత్రంగా ఒక ఐ ఫోనును యువతికి అందజేసిన దృశ్యం ఆ వీడియోలో ఉంది. ట్వట్టర్ ప్రొఫైల్ సైన్స్ గర్ల్ ఈ వీడియోను షేర్ చేశారు. ఒక మహిళ చేతి నుంచి పొరపాటున జారి, సముద్రంలో పడిపోయిన ఐఫోనును తిమింగలం తన నోటితో ఆమెకు అందించిందనే విషయాన్ని క్యాప్షన్ రూపంలో రాశారు. ఈ ఘటన నార్వేలోని హైమర్‌ఫెస్ట్ హార్బర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఈ ఫ్రెండ్లీ తిమింగలాన్ని చూసేందుకు వెళ్లారు. ఈ సందర్భంలో ఒక యువతికి చెందిన ఐఫోను సముద్రంలో పడిపోయింది. దానిని గమనించిన తిమింగలం ఆ ఫోనును నోట కరచుకొని ఆ యువతికి అందజేసింది. కాగా ఈ తిమింగలానికి రష్యా నావికాదళం శిక్షణ ఇచ్చిందని తెలుస్తోంది.

Related posts