తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈయన సుధా కొంగర దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం `ఆకాశం నీ హద్దురా`(సూరరై పోట్రు). ఈ సినిమా తర్వాత సూర్య హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హరి స్టైల్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కనుంది. తమిళ సినిమాలోనే తొలిసారిగా సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ ఆడియోను విమానాశ్రయంలో ఆవిష్కరించబోతున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య, అపర్ణ మురళి జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈనెల 13వ తేదీన పాటలను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కోలీవుడ్‌లో జరిగే ఆడియో వేడుకలకు భిన్నంగా విమానాశ్రయంలో జరుపనుండడం విశేషం. ఇందుకు కారణం.. ఎయిర్‌లైన్స్‌ను స్థాపించిన సామాన్య వ్యక్తి జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా ‘సూరరైపోట్రు’ తెరకెక్కుతుండడమే. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు విమానాశ్ర యంలోనో, విమానంలోనే చిత్రీకరించినవే వుంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక విమానాన్ని అద్దెకు కూడా తీసుకున్నారు. ఆడియో వేడుకను కూడా విమానాశ్రయంలో జరిపితే బాగుంటుందని భావించి.. చెన్నై విమానాశ్రయ అధికారుల అనుమతి పొందినట్టు తెలుస్తోంది.
previous post