telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయదేవరకొండ, కియారా అద్వానీ ల ప్రేమాయణం.. !

vijaydevarakonda and kiyara on date

క్రేజీ విజయ్ దేవరకొండ సంబంధించిన ఏ వార్తలు వచ్చినా ఆవార్తలు వెంటనే వైరల్ గా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అవుతున్నవిషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ మూవీ హిందీ రీమేక్‌లో ప్రీతి పాత్రను పోషిస్తున్న కియారా అద్వానీ ఇటీవల విజయ్ దేవరకొండను కలుసుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా, హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ 2019 అవార్డుల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ ఫంక్షన్ కు ప్రముఖ బాలీవుడ్ దక్షిణాది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వానం పంపడంతో ఆ కార్యక్రమానికి అతడు కూడ వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడ వచ్చింది. పింక్ కలర్ డ్రెస్ తో వచ్చిన ఈమె ఈ ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారడంతో మీడియా కెమెరాలు అన్ని ఆమె చుట్టూ తిరిగాయి.

vijaydevarakonda and kiyara on dateఈ ఫంక్షన్ కు వచ్చిన కియారా విజయ్ లు ఒకరినొకరు ప్రేమగా పలకరించు కోవడమే కాకుండా వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా మాట్లాడు కోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియాకు వీరిద్దరూ కలసి పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలలో కొన్నింటిని విజయ్ తన ఇన్స్‌ టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో వీరిద్దరి స్నేహం పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో వీరిద్దరూ కలసి ఒక సినిమాలో నటించడం ఖాయం అనే కామెంట్స్ వస్తున్నాయి.

Related posts