telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ చేతిపై టాటూ… అసలు సీక్రెట్ ఇదే…!!

Pawan

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు క్రిష్ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హరీశ్ శంకర్‌తో కూడా సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశానికి హాజరైన పవన్..గుబురు గడ్డం తీసేసి..బాగా హెయిర్ పెంచి కనిపించారు. అంతేకాదు ఆయన చేతిపై టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనిపై రకరకాలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ రివీలయ్యింది. క్రిష్‌తో చేస్తోన్న మూవీ కోసం పవన్ టెంపరరీ గద్ద టాటూ వేయించుకున్నాడట. 18వ శతాబ్దం నాటి మొఘల్‌ పాలన నేపథ్యంలో ఈ మూవీ కథాశం తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాని సమాచారం . ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related posts