telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే : నాగబాబు

Nagababu

మెగాబ్రదర్ నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, తీసుకున్న చికిత్స తదితర విషయాలను పంచుకున్నారు. తనకు ఆస్తమా ఉందని, దీంతో కరోనా సోకడంతో ఆందోళన చెందానని అన్నారు. కరోనా నిర్థారణ అయిన వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరానని, కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డానని, మూడో రోజు వాసన గుర్తించలేకపోయానని అన్నారు. చికిత్స అనంతరం కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయని చెప్పారు. దీంతో వైద్యులు తనను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారని తెలిపారు. ఆసుపత్రి నుంచి తాను ఇంటికి వచ్చే సమయానికి తన భార్య పద్మజకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, దీంతో తామిద్దరం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. తన భార్య తనకంటే ఆరోగ్యవంతురాలని, అందుకే వెంటనే కోలుకోగలిగిందని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. కరోనాపై విజయం సాధించిన యోధుడినని తన గురించి తాను చెప్పుకోవడం తనకు ఇష్టం లేదని, తాను అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమేనని అన్నారు.

Related posts