telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”పై చరణ్ ప్రశంసలు

UU

సత్యదేవ్ హీరోగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. మ‌ల‌యాళ హిట్ మూవీ ‘మ‌హేశింతే ప్రతీకార‌మ్‌’‌ను తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని, విజ‌య ప్రవీణ ప‌రుచూరి నిర్మించారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బ‌ల్ సంగీతాన్ని, అప్పు ప్రభాక‌ర్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ సినిమాను అరకు వ్యాలీలో కేవలం 36 రోజుల్లో చిత్రీకరించారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను సినీ ప్రముఖులు కూడా చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు. తాజాగా ఈ ఖాతాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటుల ప్రదర్శనను కొనియాడారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నాకు ఎంతగానో నచ్చింది. నిజంగా కథపై ఆధారపడి తీసిన సినిమా. సత్యదేవ్, నరేష్ గారు, సుహాస్, హరి చందన, రూపల మనోరంజకమైన నటన నన్ను కట్టిపడేసింది. నీ టీమ్ నుంచి ది బెస్ట్ రాబట్టగలిగావు వెంకటేష్ మహా. ఇంత గొప్ప విజయం సాధించినందుకు విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఆర్కా మీడియా వర్స్క్ టీమ్‌కి అభినందనలు’’ అని రామ్ చరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts