ట్రంప్ నిర్ణయాన్ని కొట్టిపారేశాడు బైడెన్. వీసా బ్యాన్ ఉపసంహరణకు ఆదేశాలిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో.. వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ.. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆదేశాలను బైడెన్ ఉపసంహరించుకొన్నారు. ఇది వీసా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడంతోపాటు.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందన్నారు బైడెన్. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతుల్ని.. అమెరికాకు రాకుండా ఇది నిలువరిస్తోందన్నారు. అందుకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. గ్రీన్‌కార్డ్ లాటరీ ప్రొగ్రామ్‌పై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఈ కార్యక్రమం కింద అమెరికా ఏటా 55వేల మందికి గ్రీన్‌కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 5లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బైడెన్ నిర్ణయంపై గ్రీన్‌కార్డ్ లాటరీ విజేతలు, వీసా దరఖాస్తు దారులు సంతోషంగా ఉన్నారు. మొత్తంగా ఇది చాలా మందికి శుభవార్తగా భావిస్తున్నారు. చూడాలి మరి దీని పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు అనేది.
previous post
next post
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్