telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో టీడీపీకీ షాక్.. తెలుగు యువత అధ్యక్షుడి రాజీనామా

veerender goud tulla

తెలంగాణలో టీడీపీకీ మరోషాక్ తగిలింది. మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖ పంపించారు. రాజకీయాలలో మీరు, నా తండ్రి దేవేందర్ గౌడ్ నాకు ఆదర్శం. మీ పాలనాదక్షత, కష్టపడే మనస్తత్వం నన్ను ఆకర్షించాయి. మీ నాయకత్వంలో పనిచేసేలా చేశాయని లేఖలో తెలిపారు.

ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే వివిధ రాజకీయ అవసరాల కోసం ఈ సిద్ధాంతాలకు భిన్నంగా పార్టీ రాజీ పడింది. ఇది నన్ను ఎంతగానో బాధించింది. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నా అంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Related posts