telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరిగిపోయిన చీరతో స్టార్ హీరోయిన్ పెళ్ళి ..!.

Radhika-Apte

బోల్డ్‌ క్యారెక్టర్లు, బోల్డ్‌ స్టేట్‌మెంట్‌లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రాధిక ఆప్టే తన పెళ్లి సమయంలో కట్టుకున్న చీర చాలా చోట్ల చిరిగిపోయి ఉందట. అయితే అలాంటి చీర పెళ్లి వేడుకలో ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందో కూడా వివరించింది రాధిక. అది తన అమ్మమ్మ చీర అని ఆమె జ్ఞాపకార్థమే ఆ చీరను కట్టుకున్నానని తెలిపింది. ఆ చీర చాలా చోట్ల చిరిగి ఉన్న అదే చీరతో తాను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్టుగా వెల్లడించింది. రాధిక 2012లో బ్రిటీష్ సంగీత కళాకారుడు టేలర్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కూడా సినిమాలో నటిగా కొనసాగుతున్న రాధిక, భర్తతో కలిసున్న సమయం చాలా తక్కువ. బాలీవుడ్‌తో పాటు సౌత్‌ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ బ్యూటీ పాత్ర డిమాండ్‌ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటోంది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లతోనూ హల్‌చల్‌ చేస్తున్న ఈ బ్యూటీ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళ హిందీ సినిమాలతో పాటు ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది రాధిక. గతంలో పలు సౌత్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ దక్షిణాది హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

Related posts