telugu navyamedia
సినిమా వార్తలు

ఇప్పటికీ షాక్ లోనే అల్లు అర్జున్…!?

allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేని గురించి షాకయ్యారు ? అసలు విషయమేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అసలేం జరిగిందంటే… అల్లు అరవింద్ తన మనవడు అల్లు అయాన్ కు పుట్టినరోజు కానుకగా ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇప్పటికి షాక్ లోనే ఉన్నారట బన్నీ. అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అయాన్ తన ఐదవ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఎప్పటిలాగే అభిమానులతో పాటు తల్లిదండ్రులైన బన్నీ, ఆయన సతీమణి కూడా సోషల్ మీడియా వేదికగా అయాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ అయాన్ తాతయ్య మాత్రం ఓ స్పెషల్ పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు బన్నీ.

“మా నాన్న అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నా. 45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. పూల్‌ కావాలని అయాన్ చెప్పాడు. నాన్న సరే అని కట్టించేశారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. నాలుగో తరం పిల్లలు లక్కీ. వాళ్లని చూసి అసూయగా ఉంది. ఏదైతేనేం మేం దీనికి “అల్లు పూల్‌” అని పేరు పెట్టాం” అంటూ పోస్ట్‌లో బన్నీ పేర్కొన్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో తన పిల్లలు ఆడుతున్న ఫొటోలను కూడా షేర్ చేశారు.

Related posts