ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత, థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్ ఆరోగ్యం పై పలు వదంతులొస్తున్న నేపథ్యంలో సునీల్ నారంగ్ సోదరుడు భరత్ నారంగ్ మాట్లాడుతూ, “రాత్రి సడెన్ గా గుండె నొప్పి రావడంతో ఆయనను అపోలో హాస్పిటల్ లో చేర్పించాము. డాక్టర్స్ వెంటనే స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అవుతారు. తన ఆరోగ్యం గురించి ఫోన్లు చేస్తున్న అందరికీ సునీల్ నారంగ్ కృతజ్ఞతలు చెప్తూ తాను క్షేమంగా ఉన్నట్లు, రేపు డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలుపమన్నారు” అని భరత్ నారంగ్ అన్నారు. కాగా నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఎషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్ నిర్మాణం కూడా సునీల్ నారంగ్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా పెట్టి లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు.