telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

ఐటీ దాడులను లైట్ తీసుకున్న దిల్ రాజు

Dil-Raju

‘మహర్షి’ సినిమా సహనిర్మాత దిల్ రాజు నివాసంతో పాటు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యవహారం ఐటీ దాడులు జరగడం సర్వసాధారనమైన విషయం అని తెలిపారు. భారీ సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మహర్షి సినిమా బిజినెస్ భారీ స్థాయలో జరిగినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, ప్రకాశ్ రాజ్, అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వంశీపైడిపల్లి తెరకెక్కించగా, దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

Related posts