telugu navyamedia
సినిమా వార్తలు

తాప్సీ ‘రష్మీ రాకెట్’ విడుద‌ల ..

టాలీవుడ్‏లోకి రాఘ‌వేంధ్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక ఇటు తెలుగులో మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అటు బాలీవుడ్‏లోనూ అవకాశాలను అందుకుంది తాప్సీ.

అదే సమయంలో అక్కడ ఆమెకు సూపర్ హిట్స్ లభించడంతో.. పూర్తిగా బాలీవుడ్‏కు షిఫ్ట్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ.  అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది  బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

Taapsee Pannu: People moving beyond concept of no-brainer films | Hindi Movie News - Times of India

తాజాగా తాప్సీ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ మూవీ ‘రష్మీ రాకెట్స్‌. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఆకర్ష్ ఖురానా రూపొందించిన ఈ మూవీలో అథ్లెట్‌గా కనిపించనుంది తాప్సీ. ఓ లేడీ అథ్లెట్ తన లక్ష్యం చేరడం కోసం ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కొంది ఎలాంటి వివక్షకు గురైంది? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. తన ద్వారా మహిళ లింగ వివక్ష టెస్టింగ్.. స్త్రీత్వంపై ‘రష్మీ రాకెట్’ తన గెలుపు ద్వారా ఈ ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంది? అనే అద్భుతమైన నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది.

అలాగే గ్రామీణ స్థాయి నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అవమానాలు ఎదుర్కొన్న కొంత మంది అథ్లెట్ల జీవితాలని స్ఫూర్తిగా ఈ సినిమాను దర్శకుడు ఆకర్ష్ ఖురానా తెరకెక్కించార‌నేది ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

 ‘పింక్’, ‘బద్లా’, ‘నామ్ షభానా’ వంటి విభిన్న సినిమాల మాదిరిగానే  ‘రష్మీ రాకెట్’ కూడా మంచి ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందింది. ఈ సినిమాపై  తాప్సీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా  అక్టోబర్ 15న జీ5 ఓటీటీలో విడుదలవుతోంది.

Related posts