telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ తో సూపర్ స్టార్… ఇక అభిమానులకు పండగే…!

Mahesh-and-Chiru

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేష్‌ బాబు నటించబోతున్నారట. నక్సలైట్ పాత్రలో మహేష్ కెమెరా అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చెర్రీ కూడా ఇందులో నక్సలైట్‌గా కనిపిస్తుండగా.. అతడితో పాటు మహేష్ పాత్ర కాసేపు ఉండబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవల కొరటాల శివ, మహేష్‌ను కలిసి పాత్ర గురించి చెప్పినట్లు టాక్. ఇక కొరటాలతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ పాత్రలో నటించేందుకు మహేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Related posts